గూడూరు కోర్టు సెంటర్‌లో విస్తృత వాహన తనిఖీలు..

గూడూరు: నెల్లూరు జిల్లా పోలీసు అధికారి (ఎస్పీ) ఆదేశాల మేరకు గూడూరు టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ప్రత్యేక వాహన తనిఖీ కార్యక్రమం నిర్వహించారు. సీఐ మాలకొండయ్య ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది కోర్టు సెంటర్ ప్రధాన రహదారిపై ముమ్మర తనిఖీలు చేపట్టారు.

ఈ సందర్భంగా రహదారిపై ప్రయాణిస్తున్న వాహనాలను ఆపి, వాహనాల డిక్కీలు, లగేజీలు మరియు అనుమానాస్పద వస్తువులను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు సీఐ మాలకొండయ్య తెలిపారు.

వాహనదారులు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ తదితర వాహన పత్రాలను వెంట ఉంచుకోవాలని సూచించారు. ట్రాఫిక్ మరియు మోటారు వాహన చట్టాల నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

ఈ తనిఖీ కార్యక్రమంలో గూడూరు టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు చెందిన పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

error: Content is protected !!
Prajaveek Shanam