
జన్మదిన సందర్భంగా మర్యాదపూర్వక భేటీ – శుభాకాంక్షలు తెలిపిన సీఎం
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి N. Chandrababu Naiduను గూడూరు ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి Pasim Sunil Kumar తన జన్మదినం సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. భగవంతుడు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని, ప్రజాసేవలో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. అలాగే ఇటువంటి జన్మదిన వేడుకలను మరెన్నో సంవత్సరాలు ఆనందంగా జరుపుకోవాలని హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారు.
ముఖ్యమంత్రి ఆశీస్సులు పొందిన అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. తనపై చూపుతున్న అభిమానానికి, ప్రోత్సాహానికి ముఖ్యమంత్రికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
పార్టీ కార్యకర్తగా ప్రారంభమైన తన రాజకీయ ప్రయాణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వం ఎంతో కీలకమైందని పేర్కొన్నారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ గూడూరు నియోజకవర్గ అభివృద్ధికి మరింత కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు.
ఈ మర్యాదపూర్వక భేటీ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.












