తెలుగు దేశం పార్టీ యూనిట్ సమావేశాలలో ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ జన్మదిన వేడుకలు

గూడూరు: గూడూరు 2వ పట్టణం 4వ క్లస్టర్ పరిధిలోని 18, 15 యూనిట్ల సమావేశాలలో యూనిట్ ఇంచార్జ్‌లు అబ్దుల్ రహీమ్, ఇశ్రాయేల్ కుమార్ ఆధ్వర్యంలో గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ బిల్లు చెంచురామయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ పేదల పక్షపాతి, ప్రజాసేవకు అంకితభావంతో పనిచేస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, కుటుంబ సమేతంగా సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. అలాగే రాజకీయంగా మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి ప్రజాసేవలో మరింతగా రాణించాలని కోరుతూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో 4వ క్లస్టర్‌కు చెందిన క్లస్టర్ ఇంచార్జ్‌లు, యూనిట్ ఇంచార్జ్‌లు, యూనిట్ కో-ఇంచార్జ్‌లు, బూత్ కన్వీనర్లు, బూత్ కో-కన్వీనర్లు, ఏఎంసీ డైరెక్టర్, దేవస్థానం సభ్యులు, వార్డు అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Prajaveek Shanam