తైపీ (తైవాన్): ప్రపంచ ప్రఖ్యాత సాంకేతిక ప్రదర్శన అయిన కంప్యూటెక్స్ 2026లో ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి పాల్గొన్నారు. తైవాన్‌లో నిర్వహించిన ఈ ప్రదర్శనలో ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎంటర్ప్రైజ్ సర్వర్లు, స్టోరేజ్ టెక్నాలజీలు, ఆధునిక హార్డ్‌వేర్ తయారీ వ్యవస్థలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ప్రపంచ ప్రముఖ టెక్నాలజీ సంస్థల ప్రతినిధులతో సమావేశమైన ఆయన భవిష్యత్ భాగస్వామ్యాలు, పెట్టుబడులు, సాంకేతిక సహకార అవకాశాలపై విస్తృతంగా చర్చలు జరిపారు. సాంకేతిక రంగంలో జరుగుతున్న వేగవంతమైన మార్పులు, నూతన ఆవిష్కరణలు మరియు పరిశ్రమల అభివృద్ధికి దోహదపడే అవకాశాలపై అవగాహన పొందారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌ను ఎలక్ట్రానిక్స్ మరియు టెక్నాలజీ తయారీ రంగంలో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి నారా లోకేష్ దూరదృష్టికి అనుగుణంగా ఈ పర్యటన ఎంతో ఉపయోగకరమైన అవగాహనలను అందించిందన్నారు. భవిష్యత్తులో రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు ఆకర్షించేందుకు, సాంకేతిక రంగంలో అభివృద్ధిని వేగవంతం చేసేందుకు ఈ పర్యటన ద్వారా లభించిన అనుభవాలు దోహదపడతాయని పేర్కొన్నారు.













