
అనారోగ్య బాధితురాలికి రూ.94,158 సీఎం రిలీఫ్ ఫండ్ LOC అందజేసిన ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్
గూడూరు పట్టణంలోని నరసింగారావుపేట బీసీ కాలనీకి చెందిన శ్రీమతి మూలం మస్తానమ్మ అనారోగ్యంతో బాధపడుతూ నెల్లూరులోని జీవీపీ బ్రెయిన్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఆమె వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా, రూ.94,158 విలువైన ఎల్ఓసీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) మంజూరైంది.ఈ సందర్భంగా గూడూరు శాసనసభ్యులు మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పాశిం సునీల్ కుమార్ బాధిత కుటుంబ సభ్యులకు ఎల్ఓసీని అందజేశారు.ప్రజలకు అవసరమైన సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోందని, ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు వైద్య చికిత్సల కోసం ఆర్థిక భరోసా లభిస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సహాయనిధి మంజూరుకు సహకరించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.












