వివాహేతర సంబంధం.. భార్య హత్య


తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలో వివాహేతర సంబంధం కారణంగా ఓ మహిళ హత్యకు గురైన ఘటన సంచలనం రేపింది. స్థానికంగా నివసిస్తున్న ధర్మరాజా, అక్షయ దంపతులకు ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు.
పోలీసుల సమాచారం ప్రకారం, అక్షయ తనతో కలిసి సెలూన్‌లో పనిచేసే జోషువాతో సన్నిహిత సంబంధం కొనసాగిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయమై భర్త ధర్మరాజా పలుమార్లు హెచ్చరించినప్పటికీ ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో భార్యను ప్రియుడితో కలిసి ఉన్న సమయంలో ధర్మరాజా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. తీవ్ర ఆగ్రహానికి లోనైన అతడు అక్షయపై దాడి చేసి గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటన అనంతరం జోషువా అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం.కుటుంబ జీవితం నాశనమైందంటూ ధర్మరాజా ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు ధర్మరాజాను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.

error: Content is protected !!
Prajaveek Shanam