ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన RDO అరుణ కుమారి


గూడూరు, జూన్ 6: గూడూరు రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో)గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎం. అరుణకుమారి  గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాశం సునీల్ కుమార్ గారిని ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా గూడూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని పరిపాలనా అంశాలు, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై చర్చించినట్లు తెలిసింది. ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించినట్లు సమాచారం.
నూతన బాధ్యతలు చేపట్టిన ఆర్డీవో అరుణకుమారి గారికి ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజల ఆశయాలకు అనుగుణంగా సమర్థవంతమైన పరిపాలన అందించాలని ఆకాంక్షించారు.

error: Content is protected !!
Prajaveek Shanam