ఎస్సీ సెల్ నాయకుడు నాగార్జునకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్

గూడూరు, జూన్ 6: గూడూరు నియోజకవర్గ టీడీపీ ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి యల్లసిరి నాగార్జున గారి జన్మదినం సందర్భంగా గూడూరు శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పాశం సునీల్ కుమార్ గారు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి నాగార్జున జన్మదిన వేడుకలను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ మాట్లాడుతూ, పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తున్న కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి నిజమైన బలం అని పేర్కొన్నారు. యల్లసిరి నాగార్జున పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజలకు సేవ చేస్తూ ముందుకు సాగుతున్నారని కొనియాడారు.
అలాగే కార్యకర్తలతో ఎంతో ఆప్యాయంగా, స్నేహపూర్వకంగా మెలిగే నాయకుడిగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రత్యేక గుర్తింపు పొందారని నాయకులు పేర్కొన్నారు. కార్యకర్తల కష్టసుఖాల్లో భాగస్వామిగా ఉంటూ వారికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే నాయకుడిగా ఆయన పేరు సంపాదించుకున్నారని అన్నారు. పదవులు, హోదాలకు అతీతంగా ప్రతి కార్యకర్తను కుటుంబ సభ్యుడిలా ఆదరిస్తూ ముందుకు నడిపించే నాయకత్వ లక్షణాలు సునీల్ కుమార్ సొంతమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నాగార్జునకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

error: Content is protected !!
Prajaveek Shanam