
గూడూరు, జూన్ 6: ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయడమే తన ప్రధాన బాధ్యత అని గూడూరు శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పాశం సునీల్ కుమార్ గారు పేర్కొన్నారు. శనివారం తన నివాసానికి వచ్చిన ప్రజలను కలిసి వారి సమస్యలను ఓర్పుగా విని వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా వివిధ గ్రామాలు, పట్టణ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, వాటిని వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేసి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు సకాలంలో అందేలా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ మాట్లాడుతూ, ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే తన లక్ష్యమన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుతో పాటు నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా తన నివాసం, కార్యాలయం వారికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని చెప్పారు.
ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని వాటి పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపడం వల్లే ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రజల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని స్థానికులు పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజా నాయకుడిగా, సమస్యల పరిష్కారంలో చురుకైన నాయకుడిగా ఆయన గుర్తింపు పొందుతున్నారని కొనియాడారు.












