
చిల్లకూరు మండలం, గుత్తావారిపాలెం: చిల్లకూరు మండలంలోని గుత్తావారిపాలెం గ్రామంలో స్వయంభువుగా వెలసిన శ్రీశ్రీశ్రీ పేరంటాల్లమ్మ అమ్మవారికి గ్రామ పొంగళ్ళు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు సామూహికంగా మేళతాళాలతో తరలివెళ్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పొంగళ్ళు పొంగించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయాన్ని పూలతో అందంగా అలంకరించారు.ఈ కార్యక్రమాలు మాజీ సర్పంచ్ చిట్టేటి నారాయణ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో జరిగాయి. కార్యక్రమంలో భాగంగా మాజీ సర్పంచ్ చిట్టేటి నారాయణ ఆహ్వానం మేరకు గూడూరు శాసన సభ్యులు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పాశిం సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఆయనతో పాటు పెంచలకోన ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ తానంకి నానాజీ , పెన్వర్ డైరెక్టర్ మధుకృష్ణ ,కూడా హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యే సునీల్ కుమార్కు ఘన స్వాగతం పలికి తమ సమస్యలు, గ్రామ అభివృద్ధి అంశాలను వివరించారు. అనంతరం అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రముఖ ప్రజా ప్రతినిధులు , నాయకులు గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.













