ఎస్సీ, ఎస్టీల సమస్యలపై జిల్లా జాయింట్ కలెక్టర్‌కు కలసిన డీవీఎంసీ సబ్యులు

ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారానికి పలు అధికారులను కలిసిన డీవీఎంసీ సభ్యులు


గూడూరు డివిజన్ పరిధిలోని ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన పలు సమస్యల పరిష్కారం కోసం డీవీఎంసీ సభ్యులు ఏసుపాక పెంచలయ్య, రావూరు సురేంద్ర సోమవారం నెల్లూరు జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొని జిల్లా జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం MEPMA ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎం. కిరణ్ కుమార్‌ను కలిసి పలు సమస్యలపై వివరంగా చర్చించారు.ఈ సందర్భంగా గూడూరు మండలంలోని పలు గ్రామాలకు చెందిన అర్జీదారులతో కలిసి వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గాంధీనగర్‌లోని హిందూ స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించేందుకు అవసరమైన షెల్టర్ (భవనం) నిర్మాణంతో పాటు ప్రహరీ గోడ ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే పాలిచర్ల రాజుపాలెం గ్రామంలోని ఎస్టీ కుటుంబాలకు సంబంధించిన భూములకు పట్టాలు మంజూరు చేయాలని, భూదానం గ్రామంలోని స్మశానవాటిక సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. విందూరు గ్రామంలో ఎస్సీ లబ్ధిదారులకు కేటాయించిన భూములకు హద్దులు చూపించి భూ వివాదాలను పరిష్కరించాలని అధికారులను కోరారు.ఈ సందర్భంగా డీవీఎంసీ సభ్యులు మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ సూచనల మేరకు ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సంబంధించిన భూములు, స్మశానవాటికలు, మౌలిక సదుపాయాల సమస్యలు చాలా కాలంగా పెండింగ్‌లో ఉండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన ప్రజలకు సంబంధించిన సమస్యలను తక్షణమే పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రభుత్వం సామాజిక న్యాయం సాధనకు కట్టుబడి ఉందని, అదే దిశగా స్థానికంగా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ప్రజలకు కేటాయించిన భూములపై హక్కులు కల్పించడం, స్మశానవాటికల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన వంటి అంశాలను ప్రాధాన్యతగా తీసుకొని త్వరితగతిన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.సమస్యలను ఓర్పుతో విన్న జిల్లా జాయింట్ కలెక్టర్, MEPMA ప్రాజెక్ట్ డైరెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు డీవీఎంసీ సభ్యులు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులో కూడా నిరంతరం అధికారులను కలిసి పోరాటం కొనసాగిస్తామని వారు పేర్కొన్నారు.

error: Content is protected !!
Prajaveek Shanam