పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని వామపక్షాల ధర్నా


గూడూరు న్యూస్:
పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను తగ్గించాలని కోరుతూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో గూడూరులో ధర్నా నిర్వహించారు.
రాష్ట్ర స్థాయి పిలుపు మేరకు గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద సీపీఐ, సీపీఎం నాయకులు రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పెరుగుతున్న ఇంధన ధరలు సామాన్య ప్రజలపై అదనపు భారం మోపుతున్నాయని పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో రవాణా ఖర్చులు అధికమై ప్రజల దైనందిన జీవితంపై ప్రభావం పడుతోందన్నారు.
వంటగ్యాస్ ధరల పెరుగుదల వల్ల కుటుంబాల ఆర్థిక పరిస్థితిపై ఒత్తిడి పెరుగుతోందని తెలిపారు. ఇంధన ధరలను నియంత్రించి సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.ధర్నా కారణంగా కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. అనంతరం పోలీసులు, నాయకుల మధ్య చర్చల తర్వాత ఆందోళనను విరమించారు.ఈ కార్యక్రమంలో సీపీఐ నియోజకవర్గ సహాయ కార్యదర్శి జమాలుల్లా, సీపీఐ పట్టణ కన్వీనర్ యాదాల సునీల్, ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు చల్లా వెంకటేశ్వర్లు, ముఠా వర్కర్స్ నాయకులు వెంకటయ్య, ఏఐఎస్‌ఎఫ్ నాయకులు రిజ్వాన్, హర్షద్, బాలాజీ, హనీఫ్, దీవెన్, సీపీఎం నాయకులు పామంజి మణి, బి.వి. రమణయ్య, అడపాల ప్రసాద్, ఎంబేటి చంద్రయ్య, దారా కోటేశ్వరరావు, బి. చంద్రయ్య, మధు తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Prajaveek Shanam