తోనుకుమలలో నూతన శ్రీరామాలయ నిర్మాణానికి ఎమ్మెల్యేను కలిసిన గ్రామ ప్రతినిధులు

గూడూరు, జూన్ 11: గూడూరు నియోజకవర్గంలోని తోనుకుమల గ్రామంలో నూతన శ్రీరామాలయ నిర్మాణానికి సంబంధించిన ఏర్పాట్లలో భాగంగా గ్రామ ప్రతినిధులు గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్‌ను కలిశారు. ఈ కార్యక్రమం పెంచలకోన మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ తనంకి నానాజీ, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దువ్వూరు రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది.గ్రామానికి చెందిన అరురి చంద్రశేఖర్, అరురి మణికుమార్, వంజీవక బాలాజీ తదితరులు నూతన శ్రీరాముని గుడి నిర్మాణానికి సంబంధించిన వివరాలను ఎమ్మెల్యేకు మరియు నానాజీకి తెలియజేసి వారి సహకారం కోరారు.ఈ కార్యక్రమంలో మండల బీసీ సెల్ అధ్యక్షుడు మేకల కుమార్, గ్రామ సర్పంచ్ బొమ్మళ త్రివిక్రమ్, ఉప సర్పంచ్ అరిపినేటి విజయభాస్కర్, గ్రామ పార్టీ అధ్యక్షుడు గంగిపాక వెంకటయ్య, ఉపాధ్యక్షుడు కావలి వెంకటరమణ, బూత్ కన్వీనర్ గోవిందు సురేష్, ప్రధాన కార్యదర్శి రాగి చంద్రయ్య, బూత్ కో-కన్వీనర్ కొండేటి మధు, ఫీల్డ్ అసిస్టెంట్ వాసు, పార్టీ నాయకులు నిరుపాక నారయ్య, బషీర్‌తో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.తోనుకుమల గ్రామంలో శ్రీరామాలయ నిర్మాణం విజయవంతంగా పూర్తి కావాలని ఆకాంక్షిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

error: Content is protected !!
Prajaveek Shanam