
గూడూరు, జూన్ 11:గూడూరుపట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ గ్రీవెన్స్ కార్యక్రమంలో శాసనసభ్యులు, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పాశిం సునీల్ కుమార్ ప్రజల నుండి వినతులు స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడం ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రతి అర్జీని పరిశీలించి న్యాయం జరిగేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమానికి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యేకు వివరించగా, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.












