పిల్లల సమస్యపై స్పందించిన ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్

గూడూరు, జూన్ 11: గూడూరు పట్టణంలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పాశిం సునీల్ కుమార్‌ను ఇందిరమ్మ కాలనీకి చెందిన కొందరు చిన్నారులు కలిసి తమకు ఆధార్ కార్డులు లేవని తెలిపారు.
పిల్లల సమస్యను విన్న ఎమ్మెల్యే వెంటనే వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక నాయకులకు సమాచారం అందించి, చిన్నారుల కుటుంబ సభ్యులను కలిసి పూర్తి వివరాలు సేకరించాలని సూచించారు. సంబంధిత వివరాలను క్యాంప్ కార్యాలయానికి అందజేయాలని ఆదేశించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి పౌరుడికి గుర్తింపు పత్రాలు ఉండటం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. అవసరమైన ప్రక్రియ పూర్తిచేసి పిల్లలకు ఆధార్ కార్డులు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఎమ్మెల్యే స్పందనపై చిన్నారులు, వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

error: Content is protected !!
Prajaveek Shanam