ఎన్డీఏ కూటమి విజయోత్సవ సభకు చెన్నూరు నుంచి భారీగా తరలిన నాయకులు, కార్యకర్తలు
చెన్నూరు:
ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తిరుపతిలోని దామినీడు వద్ద నిర్వహిస్తున్న విజయోత్సవ సభకు చెన్నూరు గ్రామం నుంచి నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో బయలుదేరారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర పార్టీ కార్యదర్శి మరియు కందుకూరు నియోజకవర్గ పరిశీలకురాలు మట్టం శ్రావణి రెడ్డి నాయకత్వం వహించారు. ఎన్డీఏ ప్రభుత్వం గత రెండేళ్లలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు ఈ విజయోత్సవ సభను నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు.చెన్నూరు గ్రామం నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, అభిమానులు సభకు హాజరవుతుండడం విశేషం. ఈ సందర్భంగా మట్టం శ్రావణి రెడ్డి మాట్లాడుతూ, ప్రజల ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తోందని, రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్డీఏ కూటమికి ప్రజలు మరింత మద్దతు అందించాలని కోరారు.













