
తాతపూడి ఇశ్రాయేల్ కుమార్, ఎండీ అబ్దుల్ రహీమ్ ఆధ్వర్యంలో కార్యకర్తలు ఉత్సాహంగా విజయోత్సవ సభకు తరలివెళ్లారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చంద్రగిరి నియోజకవర్గంలోని దామినీడు గ్రామంలో నిర్వహిస్తున్న విజయోత్సవ సభకు గూడూరు పట్టణం నుంచి టీడీపీ కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు.గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ ఆదేశాల మేరకు గూడూరు పట్టణం 4వ క్లస్టర్ పరిధిలోని 15, 18 యూనిట్లకు చెందిన టీడీపీ కార్యకర్తలు ఏడు టెంపోలలో సభకు బయలుదేరారు. 15, 18 యూనిట్ ఇన్‌చార్జ్‌లు తాతపూడి ఇశ్రాయేల్ కుమార్, ఎండీ అబ్దుల్ రహీమ్ ఆధ్వర్యంలో కార్యకర్తలు ఉత్సాహంగా విజయోత్సవ సభకు తరలివెళ్లారు.ఈ సందర్భంగా కార్యకర్తలు కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.












