జాతీయ ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ గోపి మాదిగ పిలుపు

గూడూరులో ఉమ్మడి జిల్లా కార్యకర్తల సమావేశం

ప్రజావీక్షణం (గూడూరు) జూన్ 15

ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో జూలై 7న నిర్వహించనున్న ఎంఆర్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఎంఆర్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ గోపి మాదిగ పిలుపునిచ్చారు.గూడూరు పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో సోమవారం వంగపురి పెంచలయ్య మాదిగ ఆధ్వర్యంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన బెల్లంకొండ గోపి మాదిగ మాట్లాడుతూ, 31 సంవత్సరాల క్రితం ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో ఎంఆర్పీఎస్ ఉద్యమం ప్రారంభమై సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాటం చేస్తోందన్నారు.ఎంఆర్పీఎస్ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ పిలుపు మేరకు జూలై 7న ఈదుమూడిలో 32వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ఉద్యమ స్ఫూర్తిని చాటాలని కోరారు.అనంతరం ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రూపొందించిన గోడపత్రికలను నాయకులు ఆవిష్కరించారు. సమావేశంలో మరో ముఖ్య పరిణామంగా ఎంఆర్పీఎస్ గూడూరు నియోజకవర్గ ఇంచార్జి వంగపురి పెంచలయ్య మాదిగను రాష్ట్ర కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు.ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి, గూడూరు నియోజకవర్గ ఇంచార్జి వంగపురి పెంచలయ్య మాదిగ, నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు కోలగట్ల రమేష్ మాదిగ, ఇండ్ల సుధాకర్ మాదిగ, పట్టణాధ్యక్షులు గోవిందు వినోద్ కుమార్ మాదిగ, ఉపాధ్యక్షులు బట్టేపాటి వంశీ మాదిగ, సీనియర్ నాయకులు వేల్పుల రవికుమార్ మాదిగ, ధారా రమణయ్య మాదిగ, కుంచం లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Prajaveek Shanam