జులై మూడో వారంలో ‘తల్లికి వందనం’ అమలు


▪️ విద్యాశాఖ అధికారులతో మంత్రి లోకేశ్ సమీక్ష
▪️ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల పెంపునకు ప్రత్యేక చర్యలు


▪️ జూన్ 29న ‘షైనింగ్ స్టార్స్’ కార్యక్రమం నిర్వహణ
▪️ రాష్ట్రానికి అదనపు NCC యూనిట్ మంజూరు : మంత్రి లోకేశ్


అమరావతి, జూన్ 16 (ప్రజా విక్షణ0:
రాష్ట్రంలో విద్యా రంగ అభివృద్ధి, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాల పెంపు, విద్యా సంక్షేమ కార్యక్రమాల అమలుపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ మంగళవారం విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ‘తల్లికి వందనం’ పథకాన్ని జులై మూడో వారంలో అమలు చేయనున్నట్లు తెలిపారు.ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. విద్యా నాణ్యత పెంపుతో పాటు పాఠశాలల్లో మౌలిక సదుపాయాల మెరుగుదలపై దృష్టి సారించాలని సూచించారు.
పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు జూన్ 29న ‘షైనింగ్ స్టార్స్’ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రతిభావంతులైన విద్యార్థులను సన్మానించి ప్రోత్సాహకాలు అందజేయనున్నట్లు చెప్పారు.
అలాగే రాష్ట్ర యువతలో క్రమశిక్షణ, దేశభక్తి భావాలు పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అదనపు NCC యూనిట్‌ను మంజూరు చేసినట్లు మంత్రి లోకేశ్ తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మరింత మంది విద్యార్థులను NCCలో భాగస్వాములను చేయాలని అధికారులకు సూచించారు.విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ప్రభుత్వం విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, విద్యా ప్రమాణాల పెంపునకు అన్ని స్థాయిల్లో చర్యలు కొనసాగుతాయని మంత్రి స్పష్టం చేశారు.

error: Content is protected !!
Prajaveek Shanam