అభివృద్ధి, సంక్షేమానికి రెండేళ్లు: కూటమి ప్రభుత్వ విజయోత్సవ సభ

కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా గూడూరులో “అభివృద్ధి – సంక్షేమానికి రెండేళ్లు” విజయోత్సవ సభను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి, గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్, ఆర్డీఓ అరుణ కుమారి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నియోజకవర్గంలో గత రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ గత ప్రభుత్వ హయాంలో ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 16 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలులో ప్రభుత్వం ముందంజలో ఉందని తెలిపారు.
మహిళా హోంమంత్రి వంగలపూడి అనితపై మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికావని ఖండించారు. మహిళలను కించపరిచే విధమైన వ్యాఖ్యలను టీడీపీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని స్పష్టం చేశారు.టీడీపీ పార్లమెంట్ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమం కనిపించలేదన్నారు. రాజకీయాల కోసం కుటుంబ బంధాలను కూడా పక్కన పెట్టిన పరిస్థితులను ప్రజలు చూశారని పేర్కొన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లుగా భావించి పాలన సాగిస్తోందని తెలిపారు. మహిళలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించిన ఘనత టీడీపీదేనని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేసిన నాయకత్వం ముఖ్యమంత్రిచంద్రబాబునాయుడిదేనని అన్నారు.

error: Content is protected !!
Prajaveek Shanam