పేద విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తున్న డ్రీమ్ ఇండియా ఫౌండేషన్

గూడూరు పట్టణంలోని సొసైటీ ప్రాంతంలో ఉన్న డ్రీమ్ ఇండియా ఫౌండేషన్ కార్యాలయంలో సంస్థ వ్యవస్థాపకుడు బొమ్మిరెడ్డి సురేందర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డ్రీమ్ ఇండియా ఫౌండేషన్ స్థాపించి 17 సంవత్సరాలు పూర్తయిందని తెలిపారు. ఈ కాలంలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక మంది నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి వారి భవిష్యత్తుకు బాటలు వేసినట్లు పేర్కొన్నారు.ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ పాఠశాలల్లో 2వ, 3వ తరగతులు చదువుతున్న ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులను ఎంపిక చేసి, వారికి ఇంటర్మీడియట్ వరకు పూర్తిగా ఉచిత విద్య అందించనున్నట్లు వెల్లడించారు. విద్యార్థుల ఎంపిక కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష ఈ నెల 25వ తేదీన గూడూరులో జరుగుతుందని తెలిపారు.అర్హత కలిగిన విద్యార్థులు ఈ నెల 24వ తేదీలోపు ప్రవేశ దరఖాస్తు ఫారాలను పూర్తి చేసి సొసైటీ ప్రాంతంలోని డ్రీమ్ ఇండియా ఫౌండేషన్ కార్యాలయంలో సమర్పించాలని కోరారు. పేద కుటుంబాల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

error: Content is protected !!
Prajaveek Shanam