
ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తండ్రి తన ముగ్గురు చిన్నారులకు ఎలుకల మందు తాగించి హత్య చేసి, అనంతరం తాను చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ దారుణ ఘటనలో గోజిత, పూజిత, లోకిత అనే ముగ్గురు బాలికలు ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
కుటుంబ కలహాలే ఈ ఘాతుకానికి కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్న పోలీసులు, అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. చిన్నారుల మృతి పట్ల గ్రామస్తులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.












