అన్నదాతల సంక్షేమమే ధ్యేయం – ఇచ్చిన మాటను నెరవేరుస్తున్న కూటమి ప్రభుత్వం: ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్

అన్నదాతల ఆర్థిక భద్రతకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని గూడూరు ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాశిం సునీల్ కుమార్ తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతు సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని పలు కార్యక్రమాలు చేపట్టిందన్నారు. రెండో ఏడాది ‘అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్’ పథకం కింద తొలి విడత నిధులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లింగంగుంట్ల వేదికగా రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నారని పేర్కొన్నారు.ఈ విడతలో రాష్ట్రవ్యాప్తంగా 46.85 లక్షల రైతు కుటుంబాలకు రూ.3,125 కోట్ల ఆర్థిక సాయం అందుతోందన్నారు. ప్రతి రైతు ఖాతాలో రూ.7,000 జమ అవుతుండగా, ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటాగా రూ.2,342.92 కోట్లు, కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద రూ.782.55 కోట్లు విడుదల చేస్తున్నట్లు వివరించారు.
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనే నమ్మకంతో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రైతుల పెట్టుబడి భారాన్ని తగ్గించి, ప్రతి రైతు కుటుంబంలో ఆర్థిక భరోసాకల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు.గూడూరు నియోజకవర్గంలోని 22,225 మంది రైతులకు ఈ విడతలో రూ.14.74 కోట్ల ఆర్థిక సాయం అందుతోందన్నారు. మండలాల వారీగా గూడూరు మండలంలో 5,188 మంది రైతులకు రూ.3.36 కోట్లు, చిల్లకూరు మండలంలో 4,591 మంది రైతులకు రూ.3.07 కోట్లు, కోట మండలంలో 3,753 మంది రైతులకు రూ.2.49 కోట్లు, వాకాడు మండలంలో 3,795 మంది రైతులకు రూ.2.48 కోట్లు, చిట్టమూరు మండలంలో 4,898 మంది రైతులకు రూ.3.33 కోట్లు అందనున్నాయనివెల్లడించారు.రైతులకు ఎల్లప్పుడూ అండగా నిలిచేది కూటమి ప్రభుత్వమేనని, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ పేర్కొన్నారు.

error: Content is protected !!
Prajaveek Shanam