
అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి విడత నిధుల విడుదల కార్యక్రమం గూడూరు పట్టణంలోని షాదీ మంజిల్‌లో నిర్వహించారు. గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్ సూచనల మేరకు వ్యవసాయ శాఖ ఏడీ గోపి నాయక్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు ఆర్థికంగా అండగా నిలుస్తున్నట్లు అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న గూడూరు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్త మండలి సభ్యుడు పేపళ్ల అమరయ్య నాయుడు మాట్లాడుతూ, రైతు సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నాయని అన్నారు. అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు నేరుగా ఆర్థిక సాయం అందడం వల్ల వ్యవసాయ ఖర్చుల భారం కొంత మేర తగ్గుతుందని పేర్కొన్నారు. రైతులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని వ్యవసాయాభివృద్ధికి కృషి చేయాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో గూడూరు పట్టణ, రూరల్ టీడీపీ అధ్యక్షులు పులిమి శ్రీనివాసులు, కొండూరు వెంకటేశ్వర్లు రాజు, శ్రీనివాసు రెడ్డి వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.












