
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గూడూరు మున్సిపాలిటీ, మండల పరిధిలో ఎక్సైజ్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా చెంబడిపాలెం గ్రామంలో నిర్వహించిన తనిఖీలలో పల్లెపాటి రేణుకమ్మ వద్ద అక్రమంగా నిల్వ ఉంచిన ఆరు మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని ఆమెపై బెల్ట్ షాపు కేసు నమోదు చేశారు.అలాగే గూడూరు పట్టణంలో నిర్వహించిన తనిఖీలలో జి. రామసుబ్బారెడ్డి బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తూ పట్టుబడగా, సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.అక్రమ మద్యం విక్రయాలు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ఎక్సైజ్ శాఖ నిరంతరం తనిఖీలు నిర్వహిస్తుందని, ప్రజలు ఇటువంటి చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు.ఈ తనిఖీల్లో సబ్ ఇన్స్పెక్టర్ ఏ. శేషమ్మ, హెడ్ కానిస్టేబుల్ బి. వేణుగోపాల్, కానిస్టేబుళ్లు సీహెచ్. రమణయ్య, బి. సుబ్బయ్య, టి. మనోహర్ పాల్గొన్నారు.












