
గూడూరు పట్టణ సమీపంలోని శారదా నగర్ లో ఉన్న లిటిల్ ఏంజెల్స్ పబ్లిక్ పాఠశాలలో ఆదివారం యోగా డే పురస్కరించుకొని ముందస్తు యోగా డే వేడుకలు శనివారం పాఠశాల మైదాన ప్రాంగణంలో విద్యార్థులచే నిర్వహించారు. ముందుగా విద్యార్థులచే పలు యోగ ఆసనాలు వేయించి యోగ వలన కలిగే లాభాలను వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కరస్పాండెంట్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ యోగా వలన అనేక లాభాలు ఉన్నాయన్నారు. యోగ చేయడం వలన శారీరిక దృఢత్వంతో పాటు అనారోగ్యాల బారిన పడకుండా నిత్య ఆరోగ్యవంతులుగా ఉంటారని పేర్కొన్నారు.అదేవిధంగా యోగా చేయడం వలన మానసిక ఒత్తిళ్లకు దూరంగా ఉంటూ నిత్యం ప్రశాంత వాతావరణంలో జీవించేందుకు యోగ ఎంతో దోహదపడుతుందన్నారు.యోగ వలన శరీరం కూడా ఎంతో సునాయాసంగా ఉంటూ ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా శరీరం ఉంటుందని ఆయన వివరించారు దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ చిన్నతనం నుండే యోగాసనాలపై శ్రద్ధ చూపాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ సుధేష్ణ,పాఠశాల ప్రిన్సిపల్ నమశివాయ,హెడ్మాస్టర్ సురేష్,ఉపాధ్యాయిని,ఉపాధ్యాయులు,విద్యార్థిని,విద్యార్థులు,పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.












