
ప్రజా వీక్షణం (గూడూరు) జూన్ 22
నెల్లూరు జిల్లా గూడూరు రెండో పట్టణ పోలీసు వలయాధికారిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన మాలకొండయ్యను సోమవారం పలువురు ప్రజా ప్రతినిధులు, సామాజిక సంఘాల నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజా కుల సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.వి. సుబ్బయ్య, ప్రజా సమస్యల నాయకుడు గొర్రెపాటి వెంకటేశ్వర్లు, బహుజన సమాజ్ పార్టీ గూడూరు పట్టణ అధ్యక్షుడు గుంటమడుగు వెంకటేశ్వరరాజు తదితరులు సీఐ మాలకొండయ్యను అభినందించారు.
నూతన బాధ్యతల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలని వారు ఆకాంక్షించారు. అనంతరం సీఐ మాలకొండయ్య వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.












