ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యం: సీఎం చంద్రబాబు

పునపరివారిపాలెం ప్రజావేదికలో పింఛన్లు, సంక్షేమం, పరిశ్రమలు, మౌలిక వసతులపై కీలక ప్రకటనలునెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం పునపరివారిపాలెం వద్ద నిర్వహించిన ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీతో పాటు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన, సంక్షేమంతో పాటు అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలిపామని గుర్తుచేసిన ముఖ్యమంత్రి, పునపరివారిపాలెంకు రహదారి, బస్సు సౌకర్యం కల్పించడం కూటమి ప్రభుత్వ ఘనతేనని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో పెత్తందారీకి తావులేదని, ప్రజల మధ్య ఉండి పాలన చేయడమే తన విధానమని స్పష్టం చేశారు.రాష్ట్రవ్యాప్తంగా 62.20 లక్షల మంది లబ్ధిదారులకు సామాజిక పింఛన్లు అందిస్తున్నామని, నెల్లూరు జిల్లాలోనే రూ.107 కోట్ల మేర పింఛన్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, పేదల సంక్షేమానికి భారీగా నిధులు కేటాయించినట్లు చెప్పారు.మహిళల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని, ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని వివరించారు. భవిష్యత్తులో ఏసీ బస్సుల్లో కూడా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.నెల్లూరు జిల్లా అభివృద్ధికి భారీ పరిశ్రమలు రానున్నాయని సీఎం వెల్లడించారు. కృష్ణపట్నం, రామాయపట్నం పోర్టులతో పాటు దుగ్గరాజుపట్నం పోర్టు కూడా అభివృద్ధి చెందుతుందని, లక్ష కోట్ల రూపాయల పెట్టుబడితో బీపీసీఎల్ ప్రాజెక్టు, కోట–చిల్లకూరు ప్రాంతాల్లో 27 భారీ పరిశ్రమలు, గూడూరులో రూ.3 వేల కోట్లతో మెగా ఫర్నిచర్ పరిశ్రమ ఏర్పాటు కానున్నట్లు తెలిపారు. నాలుగు లైన్ల రైల్వే, జాతీయ రహదారులు, సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు.రాష్ట్రాన్ని విశాఖపట్నం, అమరావతి, తిరుపతి అభివృద్ధి జోన్లుగా తీర్చిదిద్దే ప్రణాళిక ఉందని పేర్కొన్నారు. రాబోయే మూడు సంవత్సరాల్లో 36 కీలక ప్రాజెక్టులు చేపట్టనున్నట్లు తెలిపారు. జలధార కార్యక్రమం, నదుల అనుసంధానం, సోలార్ ఎనర్జీ, ఇథనాల్ ఉత్పత్తి వంటి అంశాలపై కూడా ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు.ప్రసంగంలో గత ప్రభుత్వ పనితీరుపై విమర్శలు చేసిన సీఎం, ప్రస్తుతం రాష్ట్రంలో అవినీతి రహిత పాలన అందిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో చట్టవ్యవస్థ బలోపేతం అయిందని, ప్రజలకు భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు.పునపరివారిపాలెం ప్రాంతంలో రోడ్లు, డ్రైనేజీలు, మరుగుదొడ్లు, మొబైల్ టవర్ వంటి మౌలిక వసతులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. నెల్లూరు జిల్లా అభివృద్ధిలో ముందంజలో నిలుస్తోందని, గూడూరు నియోజకవర్గం కూడా మరింత పురోగతి సాధించాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ మాట్లాడుతూ, గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో విలీనం చేయడం ఆనందదాయకమని అన్నారు. పునపరివారిపాలెం రహదారి నిర్మాణానికి ముఖ్యమంత్రి సహకారం అందించారని, దీంతో ఈ ప్రాంతంలో భూముల విలువలు గణనీయంగా పెరిగాయని తెలిపారు. చిల్లకూరు మండలంలో వంతెనలు, ఇతర అభివృద్ధి పనులు, గూడూరు ఫ్లైఓవర్ పూర్తి చేయాలని ముఖ్యమంత్రికి వినతిపత్రం అందజేస్తామని పేర్కొన్నారు.

నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం పునపరివారిపాలెం వద్ద నిర్వహించిన ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీతో పాటు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన, సంక్షేమంతో పాటు అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలిపామని గుర్తుచేసిన ముఖ్యమంత్రి, పునపరివారిపాలెంకు రహదారి, బస్సు సౌకర్యం కల్పించడం కూటమి ప్రభుత్వ ఘనతేనని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో పెత్తందారీకి తావులేదని, ప్రజల మధ్య ఉండి పాలన చేయడమే తన విధానమని స్పష్టం చేశారు.రాష్ట్రవ్యాప్తంగా 62.20 లక్షల మంది లబ్ధిదారులకు సామాజిక పింఛన్లు అందిస్తున్నామని, నెల్లూరు జిల్లాలోనే రూ.107 కోట్ల మేర పింఛన్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, పేదల సంక్షేమానికి భారీగా నిధులు కేటాయించినట్లు చెప్పారు.మహిళల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని, ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని వివరించారు. భవిష్యత్తులో ఏసీ బస్సుల్లో కూడా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.నెల్లూరు జిల్లా అభివృద్ధికి భారీ పరిశ్రమలు రానున్నాయని సీఎం వెల్లడించారు. కృష్ణపట్నం, రామాయపట్నం పోర్టులతో పాటు దుగ్గరాజుపట్నం పోర్టు కూడా అభివృద్ధి చెందుతుందని, లక్ష కోట్ల రూపాయల పెట్టుబడితో బీపీసీఎల్ ప్రాజెక్టు, కోట–చిల్లకూరు ప్రాంతాల్లో 27 భారీ పరిశ్రమలు, గూడూరులో రూ.3 వేల కోట్లతో మెగా ఫర్నిచర్ పరిశ్రమ ఏర్పాటు కానున్నట్లు తెలిపారు. నాలుగు లైన్ల రైల్వే, జాతీయ రహదారులు, సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు.రాష్ట్రాన్ని విశాఖపట్నం, అమరావతి, తిరుపతి అభివృద్ధి జోన్లుగా తీర్చిదిద్దే ప్రణాళిక ఉందని పేర్కొన్నారు. రాబోయే మూడు సంవత్సరాల్లో 36 కీలక ప్రాజెక్టులు చేపట్టనున్నట్లు తెలిపారు. జలధార కార్యక్రమం, నదుల అనుసంధానం, సోలార్ ఎనర్జీ, ఇథనాల్ ఉత్పత్తి వంటి అంశాలపై కూడా ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు.ప్రసంగంలో గత ప్రభుత్వ పనితీరుపై విమర్శలు చేసిన సీఎం, ప్రస్తుతం రాష్ట్రంలో అవినీతి రహిత పాలన అందిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో చట్టవ్యవస్థ బలోపేతం అయిందని, ప్రజలకు భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు.పునపరివారిపాలెం ప్రాంతంలో రోడ్లు, డ్రైనేజీలు, మరుగుదొడ్లు, మొబైల్ టవర్ వంటి మౌలిక వసతులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. నెల్లూరు జిల్లా అభివృద్ధిలో ముందంజలో నిలుస్తోందని, గూడూరు నియోజకవర్గం కూడా మరింత పురోగతి సాధించాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ మాట్లాడుతూ, గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో విలీనం చేయడం ఆనందదాయకమని అన్నారు. పునపరివారిపాలెం రహదారి నిర్మాణానికి ముఖ్యమంత్రి సహకారం అందించారని, దీంతో ఈ ప్రాంతంలో భూముల విలువలు గణనీయంగా పెరిగాయని తెలిపారు. చిల్లకూరు మండలంలో వంతెనలు, ఇతర అభివృద్ధి పనులు, గూడూరు ఫ్లైఓవర్ పూర్తి చేయాలని ముఖ్యమంత్రికి వినతిపత్రం అందజేస్తామని పేర్కొన్నారు.

error: Content is protected !!
Prajaveek Shanam