
గూడూరు పట్టణంలోని రాజావీధిలో వెలసిన శ్రీ శ్రీ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం 28వ వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 25 నుంచి జూలై 4 వరకు పది రోజులపాటు అత్యంత వైభవంగానిర్వహించబడినట్లు దేవస్థానం ధర్మకర్త మండలి సభ్యుడు పేపళ్ల అమరయ్య నాయుడు తెలిపారు.ఆయన మాట్లాడుతూ, గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్ పూర్తి సహాయ సహకారాలు, దేవస్థానం చైర్మన్, పాలకమండలి, దేవాదాయ శాఖ అధికారుల సమన్వయంతో బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్వహించామని చెప్పారు. ఉత్సవాల చివరి రోజు ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్ దేవస్థానానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకోవడం ఆనందదాయకమని పేర్కొన్నారు.
పది రోజులపాటు జరిగిన బ్రహ్మోత్సవాల్లో గూడూరు పట్టణం, పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి సేవలో భాగస్వాములయ్యారని తెలిపారు. అలాగే ప్రముఖ వేద పండితులు వాసు స్వామి, భార్గవ స్వామి ఆధ్వర్యంలో అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించబడినట్లు చెప్పారు.ఈ మహోత్సవాలను విజయవంతం చేయడంలో సహకరించిన భక్తులు, వాలంటీర్లు, దేవాదాయ శాఖ అధికారులు, వివిధ శాఖల అధికారులు, పోలీసు సిబ్బంది, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, దేవస్థానం సిబ్బంది, దాతలు, సేవకులు సహా ప్రతి ఒక్కరికీ పేపళ్ల అమరయ్య నాయుడు పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.













