తల్లికి వందనం కింద రూ.60.67 కోట్లు జమ.. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటుకు దీటుగా తీర్చిదిద్దుతున్నాం:

ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్

గూడూరు: ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను దశలవారీగా అమలు చేస్తోందని, రెండో విడత ‘తల్లికి వందనం’ పథకం కింద అర్హులైన తల్లుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసినట్లు గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్ తెలిపారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి ఒక్కొక్కరికి రూ.13 వేల చొప్పున నేరుగా జమ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. అలాగే ప్రైవేటు పాఠశాలలకు ఏమాత్రం తీసిపోకుండా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చర్యలుచేపడుతున్నారని అన్నారు.గూడూరు పట్టణంలోని చిల్లకూరు శేషమ్మ మున్సిపల్ హైస్కూల్ (CSM స్కూల్) లో నిర్వహించిన తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకోగా, పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం చిన్నారులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గతంలో ఎప్పుడూ లేని విధంగా తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల సమావేశాల వ్యవస్థను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, దీని ద్వారా తల్లిదండ్రులు తమ పిల్లల విద్యాభ్యాసం, పురోగతి గురించి ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం కలుగుతోందన్నారు. రెండో విడత తల్లికి వందనం నగదు అందని వారు సంబంధిత గ్రామ, వార్డు సచివాలయాల్లో సంప్రదించాలని సూచించారు.రాష్ట్రవ్యాప్తంగా 67,47,190 మంది విద్యార్థులకు రూ.10,120.78 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. గూడూరు నియోజకవర్గంలో మొత్తం 40,452 మంది విద్యార్థులకు రూ.60.67 కోట్లు అందించామని వెల్లడించారు.నియోజకవర్గ వారీగా లబ్ధిదారులు – నిధుల వివరాలు:గూడూరు టౌన్: 8,794 మందికి – రూ.13.94 కోట్లు,గూడూరు రూరల్ మండలం: 6,502 మందికి – రూ.9.75 కోట్లు,చిల్లకూరు మండలం: 6,059 మందికి – రూ.9.08 కోట్లు ,కోట మండలం: 8,615 మందికి – రూ.12.92 కోట్లువాకాడు మండలం: 5,450 మందికి – రూ.8.17 కోట్లుచిట్టమూరు మండలం: 5,032 మందికి – రూ.7.56 కోట్లుమొత్తం: 40,452 మంది విద్యార్థులకు రూ.60.67 కోట్లు జమ చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.అలాగే చిల్లకూరు శేషమ్మ మున్సిపల్ హైస్కూల్ (CSM స్కూల్) పరిధిలో 400 మంది విద్యార్థులకు ‘తల్లికి వందనం’ పథకం ద్వారా ఆర్థిక సాయం అందించినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఈఓ సనత్ కుమార్, ఎంఈఓలు మాధవరావు, కాంచన, పాఠశాల కమిటీ చైర్మన్ పోలయ్య, నాయకులు శ్రీనివాసులు, పేపళ్ల అమరయ్య నాయుడు,రహీం, ముత్తుజా, నాజరుద్దీన్, సద్దాం, అల్లి భాష, రవీందర్ రెడ్డి, చంద్రమౌళి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Prajaveek Shanam