విద్యార్థుల భవిష్యత్తు కోసం ఎన్డీఏ ప్రభుత్వ వినూత్న చర్యలు

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యులు ఏసుపాగ పెంచలయ్య,  రావూరు సురేంద్ర

గూడూరు అర్బన్ పరిధిలోని గాంధీనగర్ ఎంపీపీఈఎల్ ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం రాష్ట్ర ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన ‘మెగాతల్లిదండ్రులు–ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేసాన్ని ప్రధానోపాధ్యాయులు మనోహర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యుడు ఏసుపాగ పెంచలయ్య, గూడూరు డివిజన్ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యుడు రావూరు సురేంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర విద్యాశాఖ, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విద్యారంగంలో అనేక సంస్కరణలు చేపడుతున్నారని తెలిపారు. నాణ్యమైన విద్య అందించడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించడం ప్రభుత్వ విద్యా విధానానికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా బ్యాగులు, బూట్లు, యూనిఫాంలు, ఇతర విద్యా సామగ్రి అందజేయడంతో పాటు ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం’ ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నట్లు వివరించారు. అలాగే ‘తల్లికి వందనం’ పథకం కింద కుటుంబంలో చదువుతున్న ప్రతి అర్హ విద్యార్థికి రూ.15 వేల ఆర్థిక సహాయం అందిస్తున్న నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో దివిపాలెం రెండో సచివాలయం అడ్మిన్ కిరణ్ కుమార్, తెలుగుదేశం పార్టీ మండల తెలుగు యువత అధ్యక్షుడు శ్రీపాదం ఉదయ్ కుమార్, గాంధీనగర్ యూనిట్ ఇన్‌చార్జి అంకిరెడ్డి రమేష్‌రెడ్డి, ఉపాధ్యాయులు విజయలక్ష్మి, వెంకటరమణమ్మ, సునీత, చలపతి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Prajaveek Shanam