విరాట్‌ కోహ్లీకి 18తో విడదీయలేని బంధం

న్యూఢిల్లీ, ఆగస్టు 19 (ప్రజా వీక్షణం ) : ప్రపంచ క్రికెట్‌లో 18వ నంబర్ జెర్సీ అనగానే వెంటనే గుర్తుకొచ్చే పేరు విరాట్ కోహ్లీ. ఈ జెర్సీ నంబర్‌ను కోహ్లీ స్వయంగా ఎంచుకోలేదు. అండర్‌-19 రోజుల్లో క్రికెట్‌ బోర్డు కేటాయించిన సాధారణ నంబరే 18. అయితే కాలక్రమంలో అతని జీవితంలో చోటుచేసుకున్న కీలక ఘటనలు ఇదే తేదీతో ముడిపడటంతో 18వ నంబర్‌ అతని జీవితంలో ప్రత్యేక గుర్తింపుగా మారింది.
తండ్రి జ్ఞాపకంతో ముడిపడిన 18
విరాట్ కోహ్లీ తండ్రి ప్రేమ్ కోహ్లీని ఎంతో ప్రేమించేవాడు. కోహ్లీని గొప్ప క్రికెటర్‌గా చూడాలన్నది ఆయన కల. 2006 డిసెంబర్ 18న ప్రేమ్ కోహ్లీ కన్నుమూశారు. ఆ సమయంలో రంజీ మ్యాచ్ ఆడుతున్న విరాట్.. తండ్రి మరణవార్త తెలిసినా మ్యాచ్‌కు హాజరై బ్యాటింగ్ చేశాడు. తండ్రి మరణించిన తేదీ 18 కావడంతో ఆ సంఖ్య కోహ్లీకి జీవితాంతం భావోద్వేగ జ్ఞాపకంగా మిగిలిపోయింది.అంతర్జాతీయ అరంగేట్రం కూడా 18వ తేదీనేతండ్రి మరణం తర్వాత పట్టుదలతో ముందుకు సాగిన కోహ్లీ.. భారత జాతీయ జట్టులోకి ప్రవేశించాడు. 2008 ఆగస్టు 18న శ్రీలంకతో జరిగిన వన్డేలో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. తండ్రి దూరమైన రోజు, ఆయన కన్న కల నెరవేరిన రోజు రెండూ 18వ తేదీలే కావడం విశేషం.విశ్వంతో ముడిపడిన సంఖ్యగా భావించిన కోహ్లీతన జెర్సీ నంబర్‌ 18తో ఉన్న అనుబంధాన్ని కోహ్లీ ఒక ఇంటర్వ్యూలో ప్రత్యేకంగా ప్రస్తావించాడు. తాను కావాలని ఎంచుకోకపోయినా.. ఈ సంఖ్య తన జీవితంలోని ముఖ్యమైన ఘటనలతో ముడిపడటాన్ని ఒక అదృశ్య బంధంగా భావించాడు. అందుకే 18వ నంబర్ జెర్సీ ధరించిన ప్రతిసారీ తండ్రి జ్ఞాపకాలు, ఆయన ఆశీస్సులు తనకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయని కోహ్లీ భావిస్తాడు.

error: Content is protected !!
Prajaveek Shanam