
టీడీపీ పంచాయతీ అధ్యక్షుడు పార్టీలో చేరిక
రేగం మత్స్యలింగం సమక్షంలో చేరికలు
వంద కుటుంబాల వైఎస్సార్సీపీలో ప్రవేశం
స్థానిక ఎన్నికలపై పార్టీ దృష్టి
అరకు, ఆగస్టు 20 (ప్రజా వీక్షణం ): అరకు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూరింది. డుంబ్రిగూడ మండలంలోని కొర్రయి పంచాయతీ టీడీపీ అధ్యక్షుడు కిండంగి లైకోన్ వైఎస్సార్సీపీలో చేరారు. అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం సమక్షంలో, డుంబ్రిగూడ మండల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు పాంగి పరశురామ్ ఆధ్వర్యంలో ఈ చేరిక కార్యక్రమం నిర్వహించారు. కిండంగి లైకోన్తో పాటు అంజోడ, జాంకరవలస, జాముగూడ, బొందుగూడ గ్రామాలకు చెందిన సుమారు వంద కుటుంబాలు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. పార్టీ కండువాలు కప్పి వారిని నాయకులు ఆహ్వానించారు. ఈ చేరికలతో డుంబ్రిగూడ మండలంలో పార్టీ బలోపేతానికి మరింత ఊతం లభించిందని నాయకులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతూ గతంలో కూటమిని నమ్మి మద్దతు ఇచ్చామని, అయితే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు. ప్రజా సంక్షేమం కోసం పనిచేసే పార్టీగా భావించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ పోరాడుతుందని అన్నారు. ప్రజలతో నిరంతరం మమేకమై వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని, టీడీపీకి చెందిన కీలక కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరడం ఇందుకు నిదర్శనమని రేగం మత్స్యలింగం పేర్కొన్నారు. అరకు నియోజకవర్గంలో రోజురోజుకూ పార్టీకి ప్రజల మద్దతు పెరుగుతోందని, మరింత మంది నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షుడు రేగం చాణక్య, జిల్లా ప్రధాన కార్యదర్శి పాంగి నరసింగరావు, మండల ఉపాధ్యక్షుడు పొట్టంగి రామ్ ప్రసాద్, అశోక్ కుమార్, కిల్లో ధర్మానాయుడు, కొర్ర చిన్నబాబు, శెట్టి నీలవేణి, గుమ్మ నాగేశ్వరరావు, శెట్టి ఆనంద్‌తో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్థానికంగా పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని నాయకులు తెలిపారు.












