గాయత్రి–త్రిసా జోడీ సంచలనం.. 15 ఏళ్ల నిరీక్షణకు తెర!

న్యూఢిల్లీ, ఆగస్టు 21 (ప్రజా వీక్షణం ): బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో భారత బ్యాడ్మింటన్‌ అమ్మాయిలు చరిత్ర సృష్టించారు. మహిళల డబుల్స్‌లో గాయత్రి గోపిచంద్‌, త్రిసా జాలీ జోడీ అద్భుత ప్రదర్శనతో పతకం ఖాయం చేసుకుంది. క్వార్టర్‌ ఫైనల్‌లోకి ప్రవేశించడం ద్వారా 15 ఏళ్ల తర్వాత మహిళల డబుల్స్‌లో భారత్‌కు మరో పతకం అందించేందుకు ఈ జంట సిద్ధమైంది.
నాలుగో సీడ్‌పై సంచలన విజయం
16వ రౌండ్‌లో ఏడో సీడ్‌ను ఓడించిన గాయత్రి–త్రిసా జంట.. తదుపరి రౌండ్‌లో నాలుగో సీడ్‌ చైనా జోడీ జియా యీ ఫాన్‌, ఘాంగ్‌ షు గ్జియాన్‌పై సంచలన విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో తొలి సెట్‌ను 16-21తో కోల్పోయిన భారత జోడీ ఏమాత్రం ఒత్తిడికి గురికాకుండా పుంజుకుంది. రెండో సెట్‌ను 21-15తో గెలుచుకుంది.
మూడో సెట్‌లో చైనాకు చెక్‌
నిర్ణయాత్మక మూడో సెట్‌లోనూ గాయత్రి, త్రిసా ఆధిపత్యం కొనసాగింది. చైనా జోడీకి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా 21-13తో సెట్‌ను సొంతం చేసుకుని మ్యాచ్‌ను ముగించింది. దీంతో వరల్డ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు మహిళల డబుల్స్‌ విభాగంలో మరో పతకం ఖాయమైంది.
అశ్విని–జ్వాల తర్వాత రెండో జంట
గాయత్రి–త్రిసా జంట విజయంతో మహిళల డబుల్స్‌లో ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌ పతకం ఖాయం చేసిన రెండో భారత జంటగా రికార్డు సృష్టించింది. 2011లో అశ్విని పొన్నప్ప‌, గుత్తా జ్వాల జోడీ కాంస్య పతకం సాధించింది. తాజాగా గాయత్రి–త్రిసా జంట ఆ రికార్డును కొనసాగిస్తూ భారత బ్యాడ్మింటన్‌లో కొత్త అధ్యాయానికి నాంది పలికింది.

error: Content is protected !!
Prajaveek Shanam