
హైదరాబాద్, ఆగస్టు 23 ప్రజా వీక్షణం ): రాఖీ పౌర్ణిమ పండుగను పురస్కరించుకుని ప్రముఖ ఈ-కామర్స్ వేదిక అమెజాన్ వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఫ్యాషన్, అందాల ఉత్పత్తులు, గృహోపకరణాలు, వంటగది సామగ్రి, ఎలక్ట్రానిక్స్ తదితర విభాగాల్లోని ప్రముఖ బ్రాండ్ల ఉత్పత్తులపై 70 శాతం వరకు తగ్గింపు అందిస్తున్నట్లు తెలిపింది.
ప్రముఖ బ్రాండ్లపై భారీ తగ్గింపులు
రాఖీ ప్రత్యేక విక్రయాల్లో భాగంగా బిబా, లిబాస్, మాన్యవర్ వంటి ఫ్యాషన్ బ్రాండ్లతో పాటు శామ్సంగ్, ఎల్జీ, సోనీ వంటి ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ల ఉత్పత్తులపైనా ప్రత్యేక ధరలు అందుబాటులో ఉన్నట్లు అమెజాన్ వెల్లడించింది. పండుగ సందర్భంగా కొనుగోళ్లు చేసే వారికి ఈ ఆఫర్లు ప్రయోజనకరంగా ఉండనున్నాయి.
ప్రైమ్ సభ్యులకు అదనపు ప్రయోజనం
అమెజాన్ ప్రైమ్ సభ్యులకు సాధారణ తగ్గింపులతో పాటు అదనంగా 5 శాతం తగ్గింపు లభించనుంది. పండుగ బహుమతులు సకాలంలో చేరేలా వేగవంతమైన సరఫరా సదుపాయాన్ని కూడా అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది.రూ.19 నుంచే రాఖీలు
రాఖీ పండుగ కోసం రూ.19 నుంచే 500కు పైగా రకాల రాఖీలు అందుబాటులో ఉంచినట్లు అమెజాన్ పేర్కొంది. వీటిని వేగవంతమైన సరఫరా సేవ ద్వారా అందిస్తున్నారు. సోదరసోదరీమణుల కోసం ప్రత్యేకంగా స్వీట్లు, బహుమతులు కూడా రూ.99 నుంచే అందుబాటులో ఉన్నట్లు సంస్థ తెలిపింది.












