ఐపీఓకు జెమినీ ఎడిబుల్స్‌.. సెబీకి డీఆర్‌హెచ్‌పీ దాఖలు

న్యూఢిల్లీ, ఆఆగస్టు 23 (ప్రజా వీక్షణం ): ‘ఫ్రీడమ్‌’, ‘బీ-రైట్‌’, ‘ఫస్ట్‌ క్లాస్‌’ వంటి బ్రాండ్‌ పేర్లతో వంటనూనె ఉత్పత్తులను విక్రయిస్తున్న హైదరాబాద్‌కు చెందిన జెమినీ ఎడిబుల్స్‌ అండ్‌ ఫ్యాట్స్‌ ఇండియా (జీఈఎఫ్‌) పబ్లిక్‌ ఇష్యూకు సిద్ధమైంది. తొలి పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీఓ)కు అనుమతి కోరుతూ క్యాపిటల్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీకి ప్రాథమిక ముసాయిదా పత్రాలను (డీఆర్‌హెచ్‌పీ) సమర్పించింది.
పూర్తిగా ఓఎఫ్‌ఎస్‌ రూపంలో ఐపీఓ
జీఈఎఫ్‌ ప్రతిపాదిత ఐపీఓ పూర్తిగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) రూపంలో ఉండనుంది. ఇందులో భాగంగా కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు తమ వాటాలను విక్రయించనున్నారు.
4.11 కోట్ల షేర్ల విక్రయం
ఐపీఓలో ప్రమోటర్లు, ఇన్వెస్టర్లు గరిష్ఠంగా 4.11 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఓఎఫ్‌ఎస్‌ కావడంతో ఈ షేర్ల విక్రయం ద్వారా వచ్చే నిధులు నేరుగా కంపెనీకి కాకుండా వాటాలను విక్రయిస్తున్న ప్రమోటర్లు, ఇన్వెస్టర్లకు వెళ్లనున్నాయి.
హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు
జెమినీ ఎడిబుల్స్‌ అండ్‌ ఫ్యాట్స్‌ ఇండియా వంటనూనెల విభాగంలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ‘ఫ్రీడమ్‌’ తదితర బ్రాండ్లతో మార్కెట్లో గుర్తింపు పొందిన ఈ హైదరాబాద్‌ సంస్థ ఐపీఓ ద్వారా క్యాపిటల్‌ మార్కెట్లలోకి ప్రవేశించేందుకు అడుగులు వేస్తోంది.

error: Content is protected !!
Prajaveek Shanam