జైస్వాల్‌-ఫెర్నాండో మధ్య మాటల యుద్ధం

కొలంబో, ఆగస్టు 23 (ప్రజా వీక్షణం ): భారత్‌-శ్రీలంక రెండో టెస్టులో ఆదివారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీమిండియా యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌, శ్రీలంక పేసర్‌ అసిత ఫెర్నాండో మధ్య మైదానంలో తీవ్ర వాగ్వాదం జరిగింది. తొలి రోజు లంచ్‌ విరామానికి కొద్దిసేపటి ముందు ఈ ఘటన చోటుచేసుకుంది.
టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ ఇన్నింగ్స్‌ 17వ ఓవర్‌ చివరి బంతికి ఫెర్నాండో అద్భుతమైన బంతితో జైస్వాల్‌ను బౌల్డ్‌ చేశాడు. వికెట్‌ తీసిన ఆనందంలో శ్రీలంక ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. అయితే జైస్వాల్‌ మైదానం వీడుతున్న సమయంలో ఫెర్నాండో చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా వెనక్కి తిరిగి అతడిని నిలదీశాడు
ఒకరికొకరు అత్యంత సమీపంలోకి..
ఆగ్రహానికి గురైన జైస్వాల్‌ ఫెర్నాండో వైపు దూసుకెళ్లి వాగ్వాదానికి దిగాడు. ఇద్దరూ ఒకరికొకరు అత్యంత సమీపంలోకి రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సహచర ఆటగాళ్లు జోక్యం చేసుకుని ఇద్దరినీ శాంతింపజేశారు.
మూడు వరుస బౌండరీలు
ఈ ఘటనకు ముందు ఫెర్నాండో బౌలింగ్‌లోనే జైస్వాల్‌ వరుసగా మూడు బంతుల్లో మూడు బౌండరీలు బాదాడు. ఆ తర్వాతి బంతికే అతడు బౌల్డ్‌ కావడంతో ఫెర్నాండో దూకుడుగా సంబరాలు చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది.
45 పరుగుల వద్ద వెనుదిరిగిన జైస్వాల్‌
ఈ ఇన్నింగ్స్‌లో జైస్వాల్‌ 53 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లతో 45 పరుగులు చేశాడు. అయితే వికెట్‌ కోల్పోయిన తీరుకంటే, అనంతరం ఫెర్నాండోతో చోటుచేసుకున్న వాగ్వాదమే మ్యాచ్‌లో చర్చనీయాంశంగా మారింది.

error: Content is protected !!
Prajaveek Shanam