తిప్పవరప్పాడులో ఘనంగా ‘దేవాలయాలే ధ్యానాలయాలు’ కార్యక్రమం

ధ్యాన గురు శ్రీ అవార్డు గ్రహీత దేవరాజుకు ఘన సన్మానం

నెల్లూరు జిల్లా గూడూరు తిప్పవరప్పాడు ప్రజా వీక్షణం ఆగస్టు 24: శ్రీ కామాక్షి సమేత కైలాసనాథ దేవాలయంలో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ‘దేవాలయాలే ధ్యానాలయాలు’ కార్యక్రమం ఈ వారం కూడా వైభవంగా జరిగింది. గూడూరు, తిప్పవరప్పాడు, పరిసర ప్రాంతాల నుంచి పలువురు భక్తులు, ధ్యాన మిత్రులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ సందర్భంగా గోవాలో జరిగిన ధ్యాన కార్యక్రమంలో పీఎస్ఎస్ఎం గోవా ధ్యాన మిత్రుల చేత ‘ధ్యాన గురు శ్రీ’ అవార్డు అందుకున్న సమ్మా జీవ ప్రాజెక్ట్ ఇన్‌చార్జి కొండిశెట్టి దేవరాజును ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు, సన్‌షైన్ క్రషర్స్ మేనేజింగ్ పార్ట్‌నర్ శ్రీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఈ సన్మానం జరిగింది.అవార్డు గ్రహీత దేవరాజు మాట్లాడుతూ తనకు లభించిన అవార్డు తన ఒక్కరి కృషి ఫలితం కాదని, గూడూరు ధ్యాన మిత్రులందరి సమష్టి కృషికి దక్కిన గుర్తింపుగా భావిస్తున్నానన్నారు. తాను ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించిన మాతృ సంస్థ బుద్ధా పిరమిడ్ ధ్యాన ఆశ్రమంతో పాటు తనతో కలిసి నడిచిన ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులకు ఈ అవార్డును అంకితం చేస్తున్నట్లు తెలిపారు.ధ్యానం ద్వారా సమాజంలో ఆరోగ్యం, ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందించాలన్న లక్ష్యంతో ప్రతి ఒక్కరూ తాము ప్రారంభించిన ప్రయాణాన్ని గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన దేవస్థాన కమిటీ సభ్యులు, ధ్యాన మిత్రులు, వివిధ ప్రాంతాల నుంచి హాజరైన భక్తులకు మనసా, వాచా, కర్మణా త్రికరణ శుద్ధిగా కృతజ్ఞతలు తెలిపారు.పీఎస్ఎస్ఎం వ్యవస్థాపకులు డాక్టర్ బ్రహ్మర్షి సుభాష్ పత్రీజీ ఆశయాలైన ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్, ‘నో డాక్టర్–నో మెడిసిన్’, సమసమాజ నిర్మాణం వంటి లక్ష్యాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తన కృషిని కొనసాగిస్తానని దేవరాజు తెలిపారు. అవార్డు తన బాధ్యతను మరింత పెంచిందని పేర్కొన్నారు.కార్యక్రమంలో గూడూరు చాణిక్య అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్, ప్రకృతి పిరమిడ్ ధ్యాన ఆరోగ్య కేంద్ర నిర్వాహకులు, ధ్యాన మిత్రులు, దేవస్థాన కమిటీ సభ్యులు, పరిసర ప్రాంతాల భక్తులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Prajaveek Shanam