నవీన్ ఉల్ హక్‌కు పునరాగమనం

న్యూఢిల్లీ, ఆగస్టు 24 (ప్రజా వీక్షణం ప్రతినిధి): ఐపీఎల్‌లో ‘స్వీట్ మ్యాంగోస్’ పోస్ట్‌తో వైరల్‌గా మారిన అఫ్గానిస్థాన్ పేసర్ నవీన్ ఉల్ హక్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో పునరాగమనానికి సిద్ధమయ్యాడు. ఫిట్‌నెస్ సమస్యల కారణంగా ఆసియా కప్‌కు దూరమైన ఈ స్పీడ్‌స్టర్.. త్వరలో భారత్‌తో జరిగే మూడు టీ20ల సిరీస్‌కు అఫ్గానిస్థాన్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. దాదాపు రెండేళ్ల తర్వాత అతడు మళ్లీ అఫ్గాన్ జెర్సీతో అంతర్జాతీయ టీ20ల్లో కనిపించనున్నాడు.
గాయం నుంచి కోలుకున్న నవీన్.. దేశవాళీ క్రికెట్‌లో రాణించడంతో సెలక్టర్లు అతడిపై నమ్మకం ఉంచారు. అతడి రాకతో అఫ్గానిస్థాన్ పేస్ బౌలింగ్ విభాగం మరింత బలోపేతం కానుంది. 2023 వన్డే ప్రపంచకప్ అనంతరం నవీన్ 50 ఓవర్ల ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.భారత్‌తో జరిగే ఈ సిరీస్ అఫ్గానిస్థాన్ కొత్త కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్‌కు తొలి సిరీస్ కానుంది. అన్‌క్యాప్డ్ బ్యాటర్ నూర్ రహమాన్ బ్యాకప్ వికెట్ కీపర్‌గా జట్టులోకి ఎంపికయ్యాడు. స్పిన్ విభాగంలో రషీద్ ఖాన్, మహమ్మద్ నబీ, నూర్ అహ్మద్, నాంగ్యాల్ ఖరోటి వంటి ఆటగాళ్లు ఉన్నారు.భారత్‌–అఫ్గానిస్థాన్ మధ్య మూడు టీ20 మ్యాచ్‌లు సెప్టెంబర్ 13, 15, 17 తేదీల్లో జరగనున్నాయి. ఈ సిరీస్‌లో నవీన్ ఉల్ హక్‌ పునరాగమనంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
అఫ్గానిస్థాన్ జట్టుఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), రహ్మనుల్లా గుర్బాజ్, నూర్ రహమాన్ (వికెట్ కీపర్), సెడీకుల్లా అటల్, దర్విష్ రసూలీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, గుల్బదిన్ నబీ, మహమ్మద్ నబీ, రషీద్ ఖాన్, నాంగ్యాల్ ఖరోటి, నూర్ అహ్మద్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఫజల్ హక్ ఫారూఖీ, అబ్దుల్లా అహ్మద్జాయ్, నవీన్ ఉల్ హక్.

error: Content is protected !!
Prajaveek Shanam