మైనర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. జిమ్నాస్టిక్స్‌ కోచ్‌పై పోక్సో కేసు

ముంబై, ఆగస్టు 24 (ప్రజా వీక్షణం గురు ప్రతినిధి) ద్రోణాచార్య అవార్డు గ్రహీత, 45 ఏళ్ల జిమ్నాస్టిక్స్‌ కోచ్‌ గణేశ్‌ ప్రభాకర్‌పై ముంబై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. 16 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలతో విలెపార్లే ప్రాంతానికి చెందిన బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది.
పోలీసుల సమాచారం ప్రకారం.. బాధితురాలు కొన్నేళ్లుగా జిమ్నాస్టిక్స్‌లో శిక్షణ తీసుకుంటోంది. ఇంటి వద్ద చదువుకుంటున్న సమయంలో కోచ్‌ ఆమెకు వాట్సాప్‌లో ‘హాయ్‌’ అంటూ సందేశం పంపినట్లు తెలుస్తోంది. అనంతరం జిమ్నాసియంకు రావాలని, తనను కలిసేందుకు సమయం ఉందా అని కోచ్‌ అడిగినట్లు పోలీసులు తెలిపారు.బాలిక జిమ్నాసియంకు వెళ్లిన సమయంలో అక్కడ ఒంటరిగా ఉన్న కోచ్‌ ఆమెను అసభ్యంగా తాకుతూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది. అక్కడి నుంచి బయటపడిన బాలిక అనంతరం కాలేజీకి వెళ్లింది. ఆమె ముభావంగా ఉండటాన్ని గమనించిన పీఈటీ విషయం ఆరా తీయడంతో ఘటన వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు.పీఈటీ వెంటనే బాలిక కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వారు విలెపార్లే పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

error: Content is protected !!
Prajaveek Shanam