ఈ వారంలో బ్యాంకులకు 4 రోజులు సెలవులు!

హైదరాబాద్, ఆగస్టు 24 ( ప్రజా వీక్షణం ప్రతినిధి): పండుగలు, ప్రత్యేక దినాల నేపథ్యంలో ఈ వారంలో బ్యాంకులకు నాలుగు రోజుల పాటు సెలవులు రానున్నాయి. వివిధ రాష్ట్రాల్లో పండుగల ఆధారంగా సెలవులు మారుతుండటంతో ఖాతాదారులు తమ అత్యవసర బ్యాంకింగ్‌ లావాదేవీలను ముందుగానే పూర్తి చేసుకోవడం మంచిది. ఆగస్టు 25, 26 తేదీల్లో పలు ప్రాంతాల్లో పండుగ సెలవులు ఉండగా.. ఆగస్టు 28న కొన్ని ప్రాంతాల్లో రక్షాబంధన్‌ సందర్భంగా బ్యాంకులు మూతపడనున్నాయి. నెల చివరి ఆదివారం కూడా కలిసి రావడంతో మొత్తం నాలుగు రోజుల పాటు కొన్ని ప్రాంతాల్లో బ్యాంకింగ్‌ కార్యకలాపాలకు విరామం ఉండనుంది.
బ్యాంకు శాఖలు మూసి ఉన్నప్పటికీ డిజిటల్‌ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌, యూపీఐ, ఏటీఎం సేవలను వినియోగించుకోవచ్చు. అయితే చెక్కుల క్లియరెన్స్‌ వంటి కొన్ని సేవలు సెలవుల కారణంగా ఆలస్యమయ్యే అవకాశం ఉన్నందున ఖాతాదారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి.

error: Content is protected !!
Prajaveek Shanam