
చెన్నై, ఆగస్టు 25 (ప్రజా వీక్షణం ప్రతినిధి): చెన్నై సూపర్ కింగ్స్ (CSK)తో మహేంద్ర సింగ్ ధోనికి ఉన్న అనుబంధం ప్రత్యేకమైనది. 2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి సీఎస్కేతోనే కొనసాగుతున్న ధోని.. ఆ జట్టు తరఫున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా, అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా పలు రికార్డులు నెలకొల్పాడు. అయితే ఇప్పుడు ధోని–సీఎస్కే బంధంలో విభేదాలు తలెత్తినట్లు వార్తలు వస్తున్నాయి.
25 శాతం వాటా అడిగిన ధోని
కెరీర్ చివరి దశలో ఉన్న ధోని.. సీఎస్కేలో 25 శాతం వాటా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపినట్లు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే సీఎస్కే యాజమాన్యం మాత్రం తొలుత 3 శాతం వాటా ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం. దీంతో ధోని తన డిమాండ్‌ను 20 శాతానికి తగ్గించినప్పటికీ.. యాజమాన్యం 4 శాతం వాటాకు మాత్రమే పెంచినట్లు తెలుస్తోంది.5.5 శాతానికే యాజమాన్యం ఓకే?
తదుపరి చర్చల్లో ధోని 18 శాతం వాటాకు అంగీకరించేందుకు సిద్ధమైనప్పటికీ.. సీఎస్కే యాజమాన్యం చివరకు 5.5 శాతం వాటా మాత్రమే ఆఫర్ చేసినట్లు ఓ కథనం పేర్కొంది. అయితే ఈ చర్చలన్నీ మాటపూర్వకంగానే జరిగాయని, ఇరు వర్గాల మధ్య ఎలాంటి అధికారిక రాతపూర్వక ప్రతిపాదన లేదా ఒప్పందం జరగలేదని నివేదిక తెలిపింది.
ధోని భవిష్యత్తుపైనా సందిగ్ధం
వాటా విషయంలో తలెత్తిన విభేదాలు ధోని–సీఎస్కే సంబంధాలపై ప్రభావం చూపినట్లు కథనాలు పేర్కొంటున్నాయి. ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన సీఎస్కే తరఫున ధోని మళ్లీ బరిలోకి దిగుతాడా? లేదా? అన్న దానిపైనా స్పష్టత లేదని సమాచారం. 2025 ఐపీఎల్ మెగా వేలానికి ముందు సీఎస్కే ధోనిని రూ.4 కోట్లకు రిటైన్ చేసుకుంది. అయితే గాయం కారణంగా 2026 ఐపీఎల్ సీజన్లో అతను ఒక్క మ్యాచ్‌లోనూ సీఎస్కే తరఫున ఆడలేకపోయాడు.












