
పారిస్, ఆగస్టు 25 (ప్రజా వీక్షణం ప్రతినిధి): భారత మహిళా షట్లర్లు గాయత్రి గోపిచంద్, త్రీసా జాలీ మహిళల డబుల్స్ ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లారు. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకంతో మెరిసిన ఈ జోడీ ఏకంగా 12 స్థానాలు ఎగబాకి 27వ ర్యాంక్‌కు చేరుకుంది.ప్రపంచ ఛాంపియన్షిప్ ప్రారంభానికి ముందు 39వ స్థానంలో ఉన్న గాయత్రి–త్రీసా జోడీ.. టోర్నీలో సంచలన విజయాలు సాధించి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ఈ అద్భుత ప్రదర్శనతో ర్యాంకింగ్స్‌లో గణనీయమైన పురోగతి సాధించింది.
చరిత్ర సృష్టించిన జోడీ
ప్రపంచ ఛాంపియన్షిప్ మహిళల డబుల్స్‌లో కాంస్య పతకం సాధించడం ద్వారా గాయత్రి–త్రీసా జంట ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అశ్విని పొన్నప్ప–జ్వాల గుత్తా తర్వాత ఈ విభాగంలో ప్రపంచ ఛాంపియన్షిప్ పతకం సాధిచిన రెండో భారత జోడీగా రికార్డు సృష్టించింది.
పతకంతో పెరిగిన ర్యాంక్
సెమీఫైనల్లో ఓటమి ఎదురైనప్పటికీ.. ప్రపంచ వేదికపై కాంస్య పతకాన్ని సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచారు. టోర్నీలో చూపిన అద్భుత ప్రదర్శనకు ఫలితంగా గాయత్రి–త్రీసా జోడీ 39వ ర్యాంక్ నుంచి 27వ స్థానానికి చేరుకుంది.












