
న్యూఢిల్లీ, ఆగస్టు 25 (ప్రజా వీక్షణం ప్రతినిధి): భారతీయ విద్యుత్ వాహన మార్కెట్‌లో ఓలా ఎస్1 మోడల్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా సంస్థ సరికొత్త ఎస్1 ప్రో ప్లస్ మూడో తరం మోడల్‌ను పరిచయం చేసింది. వాహనం రూపకల్పనలో పెద్దగా మార్పులు లేకపోయినా.. పనితీరు, బ్యాటరీ సామర్థ్యంలో గణనీయమైన మార్పులు చేసినట్లు సంస్థ తెలిపింది.ఒక్కసారి ఛార్జింగ్‌తో 320 కి.మీ.
ఓలా ఎస్1 ప్రో ప్లస్‌లో 5.2 కిలోవాట్-గంటలు, 4 కిలోవాట్-గంటల బ్యాటరీ సామర్థ్యంతో రెండు రకాల నమూనాలు ఉన్నాయి. 5.2 కిలోవాట్-గంటల నమూనా ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 320 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని సంస్థ పేర్కొంది. 4 కిలోవాట్-గంటల నమూనా 242 కిలోమీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉంది. గరిష్ఠ వేగం గంటకు 128 కిలోమీటర్లుగా ఉంది.
2.1 సెకన్లలో 40 కి.మీ. వేగంఎస్1 ప్రో ప్లస్ గరిష్ఠ శక్తి 13 కిలోవాట్లుగా ఉంది. గంటకు 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 2.1 సెకన్లలో అందుకుంటుంది. గరిష్ఠ వేగం గంటకు 130 కిలోమీటర్లుగా ఉంటుంది.
రూ.1.59 లక్షల నుంచి ధరమూడో తరం ఎస్1 ప్రో రెండు బ్యాటరీ ఎంపికల్లో అందుబాటులో ఉంది. 4 కిలోవాట్-గంటల నమూనా 242 కిలోమీటర్లు, 3 కిలోవాట్-గంటల నమూనా 126 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని సంస్థ తెలిపింది. ఈ నమూనాల గరిష్ఠ వేగాలు గంటకు 125, 117 కిలోమీటర్లుగా ఉన్నాయి. ఎస్1 ప్రో ప్లస్ ప్రారంభ ధర రూ.1,59,999 కాగా, ఎస్1 ప్రో ప్రారంభ ధర రూ.1,29,999గా ఉంది.












