ప్రజ్ఞానంద దూకుడు.. గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్‌కు అర్హత

సెయింట్ లూయిస్, ఆగస్టు 25 (ప్రజా వీక్షణం ప్రతినిధి): భారత చెస్ గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. గ్రాండ్ చెస్ టూర్ 2026 ఫైనల్స్‌లో టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. సోమవారం జరిగిన సెమీఫైనల్లో జర్మనీ గ్రాండ్‌మాస్టర్ విన్సెంట్ కీమర్‌పై ప్రజ్ఞానంద తిరుగులేని ఆధిక్యంతో విజయం సాధించాడు.
సెమీఫైనల్లో సత్తా
సెమీఫైనల్ సమరాన్ని ఘనంగా ప్రారంభించిన ప్రజ్ఞానంద.. క్లాసికల్ గేమ్‌లలో 9-3 ఆధిక్యంతో ముందంజ వేశాడు. అనంతరం జరిగిన రెండు ర్యాపిడ్ గేమ్‌లలోనూ కీమర్‌ను ఓడించి 4-0 తేడాతో విజయం సాధించాడు. దీంతో మొత్తం స్కోరు 17-3కు చేరింది. ఈ ఆధిక్యంతో బ్లిట్జ్ గేమ్‌ల ఫలితాలతో సంబంధం లేకుండానే ఫైనల్ బెర్త్ ఖరారైంది.
టైటిల్ కోసం పోరు
ఆగస్టు 22 నుంచి 27 వరకు జరుగుతున్న గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్స్‌లో ఆగస్టు 25న టైటిల్ పోరు జరగనుంది. ఫైనల్లో ప్రజ్ఞానంద అమెరికా గ్రాండ్‌మాస్టర్లు వెస్లీ సో లేదా ఫాబియానో కరువానాలో ఒకరితో తలపడనున్నాడు.
2027 టూర్‌కు అవకాశం
గ్రాండ్ చెస్ టూర్ 2026 ఫైనల్స్‌లో టాప్-3లో నిలిచే క్రీడాకారులకు 2027 గ్రాండ్ చెస్ టూర్ పోటీలకు నేరుగా ఆహ్వానం లభిస్తుంది. ఈ సీజన్‌లో సెయింట్ లూయిస్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ టైటిల్‌ను గెలుచుకున్న ప్రజ్ఞానంద.. సింక్విఫీల్డ్ కప్‌లోనూ వెస్లీ సోతో కలిసి అత్యధికంగా 5.5 పాయింట్లు సాధించాడు.

error: Content is protected !!
Prajaveek Shanam