డీమార్ట్‌లో బిల్లింగ్‌పై మహిళ ఆగ్రహం.. రూ.60.50 వస్తువుకు రూ.67 వసూలు!

ఇండోర్, ఆగస్టు 26 (ప్రజా వీక్షణం ప్రతినిధి): డీమార్ట్‌లో షాపింగ్ చేసిన ఓ మహిళకు బిల్లింగ్ సమయంలో చేదు అనుభవం ఎదురైంది. డిస్‌ప్లే బోర్డుపై కిలో చక్కెర ధర రూ.60.50గా కనిపించడంతో ఆమె కొనుగోలు చేశారు. అయితే కౌంటర్ వద్ద బిల్లు తీసుకున్న తర్వాత పరిశీలించగా.. అదే చక్కెరకు రూ.67 చొప్పున బిల్లు చేసినట్లు గుర్తించారు.
దీంతో ఆమె డీమార్ట్ సిబ్బందిని నిలదీశారు. డిస్‌ప్లేలో ఒక ధర చూపించి, బిల్లులో మరో ధర ఎందుకు వసూలు చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రతి వినియోగదారుడు బిల్లులోని ప్రతి వస్తువు ధరను పరిశీలించకపోతే పరిస్థితి ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.
వీడియో వైరల్ కావడంతో పలువురు నెటిజన్లు స్పందించారు. తమకు కూడా కొన్ని సూపర్ మార్కెట్లలో ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని తెలిపారు. షాపింగ్ పూర్తయిన వెంటనే కౌంటర్ వద్దే బిల్లును పూర్తిగా పరిశీలించాలని, డిస్‌ప్లే ధరకు, బిల్లులోని ధరకు తేడా ఉంటే వెంటనే సిబ్బంది దృష్టికి తీసుకురావాలని సూచిస్తున్నారు.

error: Content is protected !!
Prajaveek Shanam