ఆ సినిమా చేయడం నా తప్పే: నయనతార

హైదరాబాద్‌, ఆగస్టు 28 (ప్రజా వీక్షణం ప్రతినిధి): సినీ పరిశ్రమలో లేడీ సూపర్‌స్టార్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నయనతార.. స్టార్‌ హీరోలకు సమానంగా క్రేజ్‌, పారితోషికం అందుకుంటున్నారు. చిన్న చిన్న పాత్రలు, రెండో కథానాయికగా కెరీర్‌ ప్రారంభించిన ఆమె.. ఆ తర్వాత అగ్ర కథానాయికగా ఎదిగి వరుస విజయాలను సొంతం చేసుకున్నారు. తాజాగా కన్నడ స్టార్‌ హీరో యష్‌ నటించిన ‘టాక్సిక్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ నేపథ్యంలో నయనతార గతంలో ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు మరోసారి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. తన సినీ ప్రయాణంలో ఓ సినిమా చేయడం తాను తీసుకున్న అత్యంత చెత్త నిర్ణయమని ఆమె చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.
‘గజినీ’ చేయడం తప్పేనంటూ..
తాను నటించిన సినిమాల్లో ‘గజినీ’ చిత్రానికి అంగీకరించడం తప్పేనని నయనతార గతంలో పేర్కొన్నారు. 2005లో ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో సూర్య హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంలో ఆసిన్‌ కథానాయికగా నటించగా.. నయనతార రెండో కథానాయికగా కనిపించారు.
పాత్ర విషయంలో అసంతృప్తి
‘గజినీ’ సినిమాలో తన పాత్రను సరిగా చూపించలేదని నయనతార అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కథానాయికకు దగ్గరగా ఉండే పాత్ర అని చెప్పి.. సినిమాలో తనను మరో విధంగా చూపించారని, అది తనను ఎంతో బాధించిందని ఆమె వెల్లడించారు. అందుకే ఆ సినిమాలో నటించడం తన జీవితంలో తీసుకున్న తప్పు నిర్ణయాల్లో ఒకటిగా భావిస్తున్నట్లు గతంలో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి.

error: Content is protected !!
Prajaveek Shanam