యే జవానీ హై దీవానీ’కి అరుదైన గౌరవం

హైదరాబాద్‌, ఆగస్టు 30 (ప్రజా వీక్షణం ప్రతినిధి) : బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన కల్ట్ హిట్ చిత్రం ‘యే జవానీ హై దీవానీ’ మరోసారి వార్తల్లో నిలిచింది. రణ్‌బీర్ కపూర్, దీపికా పదుకొణె జంటగా నటించిన ఈ చిత్రంలోని ‘నైనా తల్వార్’ పాత్రకు ప్రతిష్ఠాత్మక ది అకాడమీ నుంచి ప్రత్యేక గుర్తింపు లభించింది.అకాడమీ ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యేక సీన్
అకాడమీ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ‘యే జవానీ హై దీవానీ’లోని ఓ ప్రత్యేక సన్నివేశాన్ని పంచుకుంది. ఉదయపూర్‌లో అదితి వివాహ వేడుకకు ముందు వచ్చే సూర్యాస్తమయ సన్నివేశాన్ని షేర్ చేస్తూ.. నైనా పాత్రకు సంబంధించిన భావోద్వేగాన్ని ప్రస్తావించింది.
‘క్షణాన్ని ఆస్వాదించాలి’.. నైనా సందేశం
ఈ సన్నివేశంలో బన్నీగా నటించిన రణ్‌బీర్ కపూర్‌తో నైనా మాట్లాడుతుంది. జీవితంలో ఎప్పుడూ పరుగులు పెట్టడం కంటే, కొన్ని సందర్భాల్లో ఉన్న చోటే ఆగి ఆ క్షణాన్ని ఆస్వాదించడం ముఖ్యమని ఆమె చెప్పే విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ భావోద్వేగ సన్నివేశాన్ని అకాడమీ ప్రత్యేకంగా గుర్తించడం అభిమానులను ఆనందంలో ముంచెత్తింది.
సోషల్ మీడియాలో అభిమానుల సందడి
అకాడమీ పోస్ట్‌పై అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఈ సినిమా తమ హృదయాల్లో ఎప్పటికీ ప్రత్యేకంగా ఉంటుందని పలువురు కామెంట్లు చేస్తున్నారు. 2013లో విడుదలైన ఈ చిత్రంలో రణ్‌బీర్, దీపికాలతో పాటు ఆదిత్య రాయ్ కపూర్, కల్కి కోచ్లిన్ నటించారు. ప్రీతమ్ అందించిన సంగీతం అప్పట్లో విశేష ఆదరణ పొందగా.. ఇప్పటికీ ఈ సినిమాకు భారీ అభిమాన వర్గం ఉంది.

error: Content is protected !!
Prajaveek Shanam