బంగారం ధరలకు బ్రేక్‌..!

హైదరాబాద్, ఆగస్టు 30 (ప్రజా వీక్షణం ప్రతినిధి) : డాలర్ బలపడటం, మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో దేశంలో బంగారం ధరలు ఇటీవలి రోజుల్లో తగ్గుతున్నాయి. వచ్చే వారం కూడా పసిడి ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగే అవకాశాలపై అంచనాలు పెరగడంతో డాలర్, అమెరికా బాండ్లకు డిమాండ్ పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. దీంతో బంగారం, వెండిపై పెట్టుబడిదారుల ఆసక్తి తగ్గే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.
హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో ఆగస్టు 30 ఉదయం 6.30 గంటల సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,58,240గా ఉంది. 22 క్యారెట్ల బంగారం రూ.1,45,050గా, 18 క్యారెట్ల పసిడి రూ.1,18,680గా నమోదైంది. కిలో వెండి ధర రూ.2.60 లక్షల వద్ద కొనసాగుతోంది.
తెలంగాణలోని వరంగల్, నిజామాబాద్, ఖమ్మం నగరాల్లోనూ ఇదే ధరలు కొనసాగుతున్నాయి. ఏపీలో విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతిలో 24 క్యారెట్ల బంగారం రూ.1,58,240, 22 క్యారెట్ల పసిడి రూ.1,45,050గా ఉంది. మాత్రం 24 క్యారెట్ల ధర రూ.1,58,390గా, 22 క్యారెట్ల ధర రూ.1,45,200గా నమోదైంది.

error: Content is protected !!
Prajaveek Shanam