జూపిటర్‌ 110పై అదిరే ఆఫర్‌.. నెలకు రూ.2,474 ఈఎంఐతో సొంతం!

హైదరాబాద్, ఆగస్టు 30 (ప్రజా వీక్షణం ప్రతినిధి): రోజువారీ ప్రయాణాలకు సౌకర్యంగా ఉండే స్కూటర్‌ కోసం చూస్తున్న వారికి టీవీఎస్‌ జూపిటర్‌ 110 మంచి ఎంపికగా నిలుస్తోంది. కుటుంబ అవసరాలకు అనువుగా ఉండటంతో ఈ స్కూటర్‌కు మార్కెట్‌లో మంచి ఆదరణ ఉంది. నగదు చెల్లింపుతో కాకుండా ఈఎంఐ ద్వారా కొనుగోలు చేయాలనుకునేవారికి కూడా ఫైనాన్స్‌ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.
రూ.74,125 నుంచి ప్రారంభ ధర
జూపిటర్‌ 110 బేస్‌ వేరియంట్‌ ధర సుమారు రూ.74,125 నుంచి ప్రారంభమవుతుంది. ఇది ఎక్స్‌షోరూమ్‌ ధర కాగా.. రోడ్డు పన్ను, బీమా, రిజిస్ట్రేషన్‌ వంటి ఖర్చులు అదనంగా ఉంటాయి.
నెలకు రూ.2,474 ఈఎంఐ
36 నెలల రుణ కాలపరిమితి, 9.7 శాతం వడ్డీ రేటుతో బేస్‌ వేరియంట్‌కు నెలకు సుమారు రూ.2,474 ఈఎంఐగా ఉండొచ్చు. డౌన్‌ పేమెంట్‌, వడ్డీ రేటు, రుణ కాలవ్యవధిని బట్టి ఈఎంఐ మారుతుంది.
కుటుంబ వినియోగానికి ప్రత్యేక ఫీచర్లు
జూపిటర్‌ 110లో 113.3 సీసీ ఇంజిన్‌, ఎల్‌ఈడీ లైట్లు, డిజిటల్‌ కన్సోల్‌, బ్లూటూత్‌ అనుసంధానం, నావిగేషన్‌, యూఎస్‌బీ ఛార్జింగ్‌ వంటి సౌకర్యాలు ఉన్నాయి. సీటు కింద సుమారు 30 లీటర్ల నిల్వ సామర్థ్యం ఉండటంతో రెండు హెల్మెట్లు పెట్టుకునే అవకాశం ఉంది. తాజాగా ద్విరంగు వేరియంట్‌ను కూడా సంస్థ తీసుకొచ్చింది.

error: Content is protected !!
Prajaveek Shanam